హోమియోపథిక్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ హోమియోపతిక్ దినోత్సవం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ హోమియోపతిక్ మరియు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉద్యోగులు మరియు సమీప గ్రామపంచాయతీ ప్రజల కోసం కళాశాల యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం మరియు ఉచిత ల్యాబ్ టెస్టులు చేయించి అవసరం ఉన్నవారికి వారి రిపోర్ట్స్ ప్రకారం ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో స్త్రీ పురుషులకు సంబంచిన ఆరోగ్య సమస్యలకు హోమియోపతి చికిత్స గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ప్రపంచ హోమియోపతిక్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కళాశాలల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎచ్ ఎస్ సాయిని మాట్లాడుతు హాల్లోపతిక్ మందుల వాడకాన్ని తగ్గిస్తూ హోమియోపతిక్ మందులు వాడాలని సూచిస్తూ ప్రస్తుత పరిస్థితులలో మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేదలు మందులు కొనే విషయంలో చాలా అవస్థలు పడుతున్నారని అట్టి వారు తన కళాశాలలో ఇచ్చే ఉచిత మందులు మరియు రోగనిర్ధారణ పరీక్షలు జరిపించుకోవచ్చని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవలసినదిగ అయన సూచించారు. అలాగే హోమియోపతి వైద్యం ద్వారా ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు రావని మరియు రోగులు తమ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని పొంది ఆరోగ్యంగా ఉంటారని తెలియచేసారు.
ఈకార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ కే వెంకట రావు , జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పార్థసారధీ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీనాథ రెడ్డి, జీ ఏం ఏ ఏం ఏ మజీద్ మరియు హోమియోపతి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి డాక్టర్ రేణుక బి వై , డాక్టర్ వి.రేఖ అసోసియేట్ ప్రొఫెసర్ ఫిజియాలజీ మరియు డాక్టర్ సుప్రీత.. హౌ మెటీరియా మెడికా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, సిబ్బంది పాల్గొని హోమియోపతి చికిత్స దాని ఫలితాలు అనే అంశంపై వారి వారి అభిప్రాయాలను తెలియచేసారు.