యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం పేరు యాదగిరిగుట్ట నుంచి యాడాద్రిగా మార్చితే కల్వకుంట్ల కుటుంబ ఆలయంగా మారిపోతుందా అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. శనివారం తెరాస కార్యనిర్వా క అధ్యక్షుడు కేటీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాడాధ్రి కు శుక్రవారం వెళ్ళి అపవిత్రం చేసాడని, అందుకు ఆలయం సంప్రోక్షణ చేయాలని ఆదేశించడం సిగ్గుచేటన్నారు.
అసలు భగవంతుడిని నమ్మని Ktr దేవుడి గురించి మాట్లాడడం సిగ్గు మాలిన చర్య అని డీకే అరుణ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండి పడ్డారు. జాతీయ పార్టీకి ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే ktr కు మింగుడు పడడం లేదని డీకే అరుణ ఆరోపించారు. గురువుగా భావించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి చెప్పులు తీసి పక్కన పెడితే తప్పు పట్టిన Ktr , నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే తెలంగాణ ప్రజలు మీకు త్వరలో సరైన బుద్ధి చెప్తారని డీకే అరుణ హెచ్చరించారు.