వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటేసి తప్పు చేశానంటూ ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త.. తన చెప్పుతో తానే కొట్టుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పగిడ్యాలకు చెందిన చిన శేషన్న అనే వ్యక్తి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు.. అయితే, తాజాగా, ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.. ఆ వీడియో ప్రకారం.. జగన్ కు ఓటు వేసి తప్పు చేశానని.. చెప్పుతో కొట్టుకుంటూ కనిపించాడు.. ఆ వీడియోలో మొదట వైసీపీ ఐడీని చూపించిన పగడం చిన శేషన్న అనే యువకుడు ఈ సెల్ఫీ వీడియో ఫోస్ట్ చేయడంతో.. వైరల్గా మారిపోయింది..
వైసీపీకి ఓటు వేసినందుకు తన చెప్పుతో తనే కట్టుకోవాలి అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చిన ఆ యువకుడు.. అన్నంతపని చేశాడు.. ఇక, గతంలో ఉన్న 27 దళిత పథకాలను రద్దు చేసిన ఘనుడు వైఎస్ జగన్ అంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.. రాష్ట్రంలో జగన్ మళ్లీ గెలుస్తే రౌడీల కింద, కునికోరుల కింద పోలీసులు పని చేయాల్సివస్తుందని ఆవేదన వెలిబుచ్చాడు.. రాజకీయంగా ఎదిగి రౌడీ సీటర్లు.. జిల్లా కలెక్టర్ పక్కన కూర్చుంటున్నారని అందుకే మళ్లీ జగన్ కు ఓటు వేయనని సెల్ఫీ వీడియోలో చెప్పుఎకొచ్చాడు చిన శేషన్న.. ఇక, వైసీపీ వ్యతిరేకులు, సీఎం వైఎస్ జగన్ అంటే గిట్టనివారు.. ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు..