ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. గొడవలు జరిగిన తర్వాత రెండు రోజులు మాట్లాడకపోవడం.. మళ్లీ నార్మల్ అవ్వడం కామన్. ఇలా కాకుండా ప్రేమికులు గొడవలు పడి ఒకర్నొకరు చంపుకున్న ఘటనలను కూడా చాలా చూశాం. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేయసితో గొడవపడి తనను తానే శిక్ష వేసుకున్నాడు. 20 యువకుడు ఆవేశపడ్డాడు. ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూనే.. ఏకంగా మర్మాంగాన్ని బ్లేడ్‌తో కట్ చేసుకున్నాడు. ఓ విషయంలో వీరి మధ్య గొడవ జరగగా.. దీంతో తనను తానే గాయపరచుకుని.. ఇప్పుడు కదల్లేని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది.
అసలు ఏం జరిగిందంటే.. బెంగాల్‌లోని కుచ్చెహర్ ప్రాంతానికి చెందిన ప్రసన్న జీత్ బర్మన్ ప్రస్తుతం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తన మామయ్య శపన్ బర్మన్‌తో కలిసి నివసిస్తున్నాడు. అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం ప్రసన్నజీత్‌కు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రసన్నజీత్ లవర్‌తో తరచుగా వీడియో కాల్స్ మాట్లాడేవాడు. కొన్నిరోజుల క్రితం ప్రసన్నజీత్ తన ప్రియురాలితో వీడియోగా మాట్లాడుతుండగా వారిద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల గొడవ జరిగింది. దీంతో ప్రసన్నజీత్‌కు ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. సహనం కోల్పోయిన అతడు.. వీడియో కాల్‌లోనే ప్రియురాలు చూస్తుండగానే.. పక్కనే ఉన్న బ్లేడ్‌తో మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
ఇంటికి చేరుకున్న శపన్ బర్మన్ రక్తపు మడుగులో పడి ఉన్న తన అల్లుడిని చూసి షాకయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న వైద్యులు వెంటనే ప్రసన్నజీత్‌కు చికిత్స అందించారు. ప్రసన్నజీత్ తన ప్రేయసి మత్తులో పడి తనను తాను గాయపరచుకున్నట్లు అతడి మామ శపన్ బర్మన్ తెలిపారు.