అప్పు కట్టలేదని బైకు కట్టి ఈడ్చుకెళ్లాడు

0
70

ఒడిశాలో ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు బైక్‎కి కట్టేసి 3 కి.మీల దూరం ఈడ్చుకెళ్లారు. తీసుకున్న రూ. 1500 అప్పును సమాయానికి చెల్లించలేదని ఇలా చేశారు. ఒడిశాలోని కటక్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన తాత చనిపోవడంతో ఖర్చుల కోసం బాధిత యువకుడు జగన్నాథ్ కొన్ని రోజుల క్రితం నిందితుల వద్ద రూ. 1500 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించకపోవడంతో ఆదివారం రాత్రి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చిన అప్పిచ్చిన వ్యక్తి.. యువకుడితో గొడవకు దిగాడు. అతడిని చితకబాదాడు. అనంతరం 12అడుగుల తాడుతో జగన్నాథ్​ చేతులను కట్టేశారు. తాడును బైక్​కి కట్టారు. 20 నిమిషాల పాటు.. 2కి.మీల కన్నా ఎక్కువ దూరం నడిపించారు.

కటక్​లోని స్టువర్ట్​పట్నా స్క్వేర్​ నుంచి సుతాహట్​ స్క్వేర్​ వరకు బైక్​వెనక పరిగెత్తాడు జగన్నాథ్​. చివరికి కొందరు స్థానికులు చొరవ చూపించి, అతడిని విడిపించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు జగన్నాథ్​. కిడ్నాప్​, అటెంప్ట్​ టు మర్డర్​ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. బైక్​ని, తాడును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్​పోలీసులు.. నిందితులను ఎందుకు అడ్డుకోలేదు? అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను అందరూ చూస్తున్నా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. ట్రాఫిక్ పోలీసులు చూసి కూడా అడ్డుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here