కేసీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

0
141

కెసీఆర్ కు తెలంగాణ కు బంధం తెగిపోయిందని వైఎస్ షర్మిల అన్నారు. దోచుకోవడానికి తెలంగాణ లో ఇక ఏం మిగలలేదు.. అందుకే ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నాడంటూ ఆరోపించారు. నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసి ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ ను షర్మిల డిమాండ్ చేశారు. ఆయన బిడ్డ లిక్కర్ మాఫియా, కొడుకు లాండ్ మాఫియా లో ఉన్నారన్నారు. వారి అవినీతిని ప్రశ్నినందుకే ఇలా తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘మా వాళ్ళని కొట్టారు.. నన్ను గాయపరిచారు… పాదయాత్ర ని ఆపారు. పోలీస్ డిపార్ట్మెంట్ కెసిఆర్ తోత్తులుగా మారారు. నన్ను బలవంతంగా తీసుకొచ్చారు… మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇంత వరకు వదలలేదు. పోలీసులు హింసిస్తున్నారు. కెసిఆర్ అవినీతిని మేము మాత్రమే ప్రశిస్తున్నం. ప్రజలంతా చూస్తున్నారు… చుట్టుపక్కల అంతా కర్ఫ్యూ పెట్టారు .కనీసం పచ్చి మంచి నీళ్ళు నేను ముట్టుకొను.’ వైఎస్ షర్మిల తన దీక్షను నాలుగు గంటలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వైఎస్ఆర్టీపీ కార్యాలయం వద్ద వైఎస్ షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here