‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం షెడ్యూల్ ఈనెల 29 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సమాచారం పంపింది వైసీపీ కేంద్ర కార్యాలయం.. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో షెడ్యూల్ ని పెంచింది పార్టీ హైకమాండ్.. ఈ నెల 20 వరకే పూర్తి కావల్సి వుందీ కార్యక్రమం.. ప్రజల స్పందనతో మరో 9 రోజులు కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది.
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా బిజీగా సాగుతోంది. స్ధానిక ప్రజాప్రతినిధులు సచివాలయ కన్వీనర్లు, గృహసారధులుతో కలిసి “జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టి మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ జగనన్న పాలనలో జరుగుతున్న మంచిని మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత మన జగనన్న సంక్షేమ పాలనపై వ్యత్యాసంను వివరిస్తూ జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించి, వైయస్ జగన్‌కు మద్దతుగా 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, వారితో సెల్ఫీలు దిగుతున్నారు. రోజూ లక్షలాదిమంది మిస్ట్ కాల్స్ ఇస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో వైసీపీ ఈ కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగించింది.