వైఎస్‌ జగన్‌ గెంటేశాడంటూ పుకార్లు.. ఘాటుగా రిప్లై ఇచ్చిన మాజీ మంత్రి..

0
51

సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వైరల్ ఏదో.. రియల్‌ ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. తాజాగా, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై కూడా రకరకాల కథనాలు సోషల్‌ మీడియాలో తిరుగుతున్నాయి.. దీనిపై ఘాటుగా స్పందించారు అనిల్‌.. సోషల్ మీడియాలోని ఓ వార్తా సంస్థ పేరుతో వచ్చిన అసత్య వార్తపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి.. ఎవరో కొంతమంది ఫేక్ గాళ్ళు.. ఫేక్ వార్తలతో అసత్య ప్రచారాలకు దిగినంత మాత్రాన ఒరిగేదేమీలేదన్నారు.. నా పేరును వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటూ.. సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని నేనన్న ఆయన.. మా తండ్రి వర్ధంతి నాడు మా తండ్రి సాక్షిగా చెప్తున్నా.. రాజకీయాలలో ఉన్నంతవరకు జగనన్నతోనే నా ప్రయాణం అన్నారు.

ఇక, జగన్మోహన్ రెడ్డి నన్ను తరిమేసే పరిస్థితి ఏనాటికి రాదన్నారు అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. ఒకవేళ వచ్చినా.. తుది శ్వాస వరకు జగనన్న కోసమే పని చేస్తానని ప్రకటించారు. పేరుపొందిన గొర్రెలతో కలిసి గొర్రెగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండడం మంచిది అనే సామెతను బాగా విశ్వసిస్తానన్న ఆయన.. మోకాలి సమస్య కారణంగా చికిత్స కోసం 15 రోజులు పాటు నగరానికి దూరంగా ఉండబోతున్నాను.. మీడియా దానిని వక్రీకరించి.. అనిల్.. జగన్ కు దూరం అవుతున్నాడు.. అనిల్ పని అయిపోయింది. అందుకే కనిపించడం లేదు. అంటూ తప్పుడు వార్తలు పెట్టకండి అని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల చికిత్స పూర్తయిన అనంతరం.. జరిగే సమావేశాలలో ఆ చికిత్సకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించేందుకు కూడా నేను సిద్ధమే అన్నారు.. అన్ని విషయాల్లో కోపం.. ఆవేశం ప్రదర్శించినా.. ఒక్క సీఎం వైఎస్‌ జగన్ విషయంలో మాత్రం ఓపికగా ఉంటాను.. గెటవుట్… గెట్ లాస్ట్ అని జగన్ నాతో అన్నా.. నేను మాత్రం ఫాలోవర్‌గానే ఉంటానని ప్రకటించారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here