పరిటాల వారసుడి ఎంట్రీ...అక్కడి నుండే !
September 20,2018 06:26 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిటాల కుటుంబం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పరిటాల శ్రీరాములయ్య మొదలుకుని పరిటాల హరీంద్ర, రవీంద్ర ఇలా వారి ప్రస్థానం సాగింది. అయితే రవీంద్ర మంత్రమే రాజకీయాల్లో అడుగుపెట్టి అనతికాలంలోనే రాష్ట్ర నాయకుడి స్థాయికి ఎదిగారు. ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కక్షల రీత్యా ఆయన హత్య చేయబడ్డారు. రవి హత్య తర్వాత అనూహ్యంగా తమ వారి కోసం సునీత ముందుకు వచ్చి రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించింది.