తాజావార్తలు

thumb

ఇక మిగతావాళ్లూ ఖాళీ చేయడం మంచిది : ఆళ్ల

June 26,2019 11:35 AM

ప్రజావేదిక కూల్చివేతపై సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజావేదిక కూల్చివేత పనులను ఈరోజు ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరకట్ట మీద 60కి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయని.. వాటన్నింటికీ నోటీసులు ఇప్పించినట్లు స్పష్టం చేశారు.

thumb

చివరదశకు ప్రజావేదిక నేలమట్టం

June 26,2019 11:05 AM

ఏపీలోని గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన అక్రమ కట్టడమైన ప్రజావేదిక కూల్చివేత ఘట్టం నిన్న సాయంత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

thumb

న్యూజిలాండ్ తో పాకిస్థాన్ ఢీ నేడే

June 26,2019 10:39 AM

ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. సెమీఫైనల్స్‌కు ఒక్క విజయం దూరంలో ఉన్న న్యూజిలండ్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది. తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌లూ గెలిస్తేనే సెమీస్‌కు వెళ్లేందుకు పాకిస్థాన్ కు అవకాశం ఉంటుంది.

thumb

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

June 25,2019 09:54 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలకు సంబంధించిన ప్రక్రియ చేపట్టడం లేదంటూ స్వయంగా రాష్ట్ర ఎన్నికల సంఘమే హైకోర్టును ఆశ్రయించింది.

thumb

అత్యాచారానికి గురైన బాలికను హోంమంత్రి సుచరిత పరామర్శ

June 25,2019 09:37 PM

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో తాజాగా అత్యాచారానికి గురైన బాలికను హోంమంత్రి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. బాధిత బాలికకు రూ.10లక్షల పరిహారంతో పాటు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

thumb

మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య

June 25,2019 09:16 PM

ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత పలు పార్టీలకు చెందిన నేతలు మధ్య హత్యల పరంపర కొనసాగుతుంది. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత ఉమా యాదవ్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు.

thumb

ప్రజావేదిక కూల్చివేత ప్రారంభం

June 25,2019 08:24 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం ప్రకటించిన 24 గంటల్లోనే కూల్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు.

thumb

చంద్రబాబుతో కోడెల కీలక భేటీ

June 25,2019 07:43 PM

విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ విచ్చేసిన టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ఏపీ స్పీకర్ భేటీ ఆయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబును ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కలిశారు.

thumb

ఇంగ్లాండ్‌ టార్గెట్ 286 పరుగులు

June 25,2019 07:12 PM

ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి ఆసీస్ వీరబాదుడు బాదింది. మొదట్లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ జోరు సాగించినా.. తర్వాతి నుంచి ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టడి చేస్తూ వచ్చారు. వోక్స్‌2/46.. స్టోక్స్‌‌1/29.. ధాటికి ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.

thumb

నేను వందశాతం బీజేపీలో చేరుతా : కోమటిరెడ్డి రాజగోపాల్

June 25,2019 06:57 PM

తనకు ఎలాంటి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్‌లో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అలాగే... పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే పార్టీ మారుతున్నానని ఆయన తెలిపారు.