విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిపోయాడు. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురవాల్సిందే, సరికొత్త రికార్డులు నమోదవ్వాల్సిందే. అతడు మైదానంలోకి వస్తున్నాడంటే చాలు.. బౌలర్లలో వణుకు, ప్రత్యర్థుల్లో బెణుకు ఉండేది. అలాంటి కోహ్లీ ఇప్పుడు ఫామ్‌లేమితో సతమతం అవుతున్నాడు. అతడు సెంచరీ కొట్టి మూడేళ్ల పైనే అవుతోంది. ఎన్ని అవకాశాలొచ్చినా, సద్వినియోగ పరచుకోలేక పోతున్నాడు.
ఈ క్రమంలోనే కోహ్లీపై వేటు పడొచ్చన్న వాదనలు ఎక్కువైపోయాయి. అది నిజమేనంటూ ఓ బీసీసీఐ అధికారి తాజాగా బాంబ్ పేల్చాడు. ‘‘భారత క్రికెట్‌కు కోహ్లీ ఎన్నో సేవలందించాడు. చాలాసార్లు అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచాడు. అయితే, కొంతకాలం నుంచి కోహ్లీ ఫామ్‌లో లేడు. సెలక్టర్లు ఫామ్ ఆధారంగానే ఆటగాళ్లను జట్టుకి ఎంపిక చేస్తారు. అంతే తప్ప వారి పేరు ప్రఖ్యాతల్ని పట్టించుకోరు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లీ రాణిస్తేనే ముందుకు సాగుతాడు. విఫలమైతే మాత్రం.. టీ20 వరల్డ్ కప్ జట్టులో అతడికి ప్రత్యామ్నాయాలను సెలక్టర్లు కచ్చితంగా వెదుకుతారు’’ అంటూ ఆ అధికారి చెప్పుకొచ్చాడు.
కోహ్లీ అభిమానులకు ఇది గుండె బద్దలయ్యే వార్తే! చాలాకాలం నుంచి కోహ్లీ ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ సహా క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. కానీ, కోహ్లీ నిరాశపరుస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు అతని స్థానంపై వేటు పడే పరిస్థితికి చేరుకున్నాడు. ఇప్పుడైనా కోహ్లీ రాణించకపోతే, బహుశా భవిష్యత్ మ్యాచెస్‌లో కోహ్లీని చూడలేం. అందుకే, కోహ్లీ బాగా రాణించాలని అందరూ కోరుకుంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ!