భారత టీ20 జట్టుకు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే, రోహిత్‌కు శాశ్వతంగా కెప్టెన్‌గా తొలగించడం లేదు. కేవలం అతను విశ్రాంతి తీసుకున్నప్పుడు మాత్రమే, హార్దిక్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సెలక్షన్ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ‘‘రోహిత్ శర్మపై పని ఒత్తిడిని తగ్గించే మార్గంలో భాగంగా.. హార్దిక్ పాండ్యాను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొన్ని టూర్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది’’ అని వెల్లడించారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో తన గుజరాత్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడంతో పాటు చాంఫియన్‌గా నిలిపాడు. అలాగే.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ కూడా అతని నాయకత్వంలో భారత్ నెగ్గింది. దీంతో.. కెప్టెన్‌గా హార్దిక్ బాగా రాణిస్తున్నాడనే ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ విశ్రాంతిలో ఉన్నప్పుడు.. భారత టీ20 జట్టుకు హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించాల్సిందిగా బీసీసీఐ ఫిక్స్ అయినట్టు తెలిసింది. తొలుత రిషభ్ పంత్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు. కానీ.. దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా పంత్‌పై మిశ్రమ స్పందనలు వచ్చిన తరుణంలో, హార్దిక్ పాండ్యాను సీన్‌లోకి తీసుకొచ్చారు.