ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ – 2023 లో భారత్ కు స్వర్ణం

0
124

కైరోలో బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2023 లో భారతదేశంకు స్వర్ణం దక్కింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది. పోటీలో నిలిచిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌ పురుషుల 50 మీ రైఫిల్ 3 స్థానాల బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌ రెండవ షూటింగ్ ప్రపంచ కప్ బంగారు పతకం. న్యూ ఢిల్లీలో జరిగిన 2021 ప్రపంచ కప్‌లో తొలిసారిగా బంగారు పతకం గెలుచుకున్నాడు. ఫైనల్లో 22 ఏళ్ల ప్రతాప్‌ సింగ్‌ 16–6తో అలెగ్జాండర్‌ షిమిర్ల్‌ (ఆస్ట్రియా)పై గెలుపొందాడు.

ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో షిమిర్ల్, ప్రతాప్‌ సింగ్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌ చేరారు. భారత్‌కే చెందిన అఖిల్‌ షెరాన్‌ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ రెండో ర్యాంకింగ్‌ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్, ఇషా సింగ్‌ క్వాలిఫయింగ్‌లో వరుసగా 32వ, 34వ స్థానాల్లో నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here