తొలి వన్డే మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో అందుబాటులోకి రావడంతో అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌తో అతడు ఫామ్‌లోకి తిరిగొస్తాడని, కచ్ఛితంగా చితక్కొడతాడని ఆశించారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. దీంతో, అతని ఆటతీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అతనికి మద్దతుగా ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
‘‘కోహ్లి కూడా మనిషే. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో అతడు తక్కువ స్కోర్లకే పరిమితమై అయ్యుండొచ్చు. అంత మాత్రాన అతడ్ని విమర్శించాలా? అతను అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకడు. ఇంకా చెప్పాలంటే.. వన్డే క్రికెట్‌లో వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్మన్. ఏ ఆటగాడైనా ఒక్కోసారి ఫామ్‌లేమితో సతమతమవ్వడం సహజమే. ప్రతీసారి మెరుగైన ప్రదర్శన చేయలేకపోతారు’’ అంటూ బట్లర్ చెప్పాడు. అంతేకాదు.. కోహ్లీలాంటి క్లాస్ ప్లేయర్ తమతో మ్యాచ్‌లో రాణించకూడదనే తాము కోరుకుంటామని అన్నాడు.
కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అతని రికార్డులే చెప్తాయని, టీమిండియాను అతడు ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని బట్లర్ పేర్కొన్నాడు. అలాంటి కోహ్లీ నైపుణ్యాలపై సందేహాలు వ్యక్తం చేయడం, అతడి ఆట తీరును ప్రశ్నించడం ఏమాత్రం కరెక్ట్ కాదని బట్లర్ చెప్పుకొచ్చాడు. కాగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 246 పరుగులకి ఆలౌట్ అవ్వగా.. భారత్ 146 పరుగులకే కుప్పకూలింగి. దీంతో ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధంచింది.