చరిత్ర సృష్టించిన అశ్విన్.. వరల్డ్ క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్

0
1971

టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా చరిత్ర సృష్టించాడు. క్రికెట్ వరల్డ్‌లో ఏ ఒక్కరికీ సాధ్యం కాని అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. 34 ఏళ్ల క్రితం నమోదైన ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని బద్దలుకొట్టేశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా అతడు ఈ ఘనతని సాధించాడు. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి అశ్విన్ (42 నాటౌట్) భారత ఇన్నింగ్స్‌ని ముందుకు సాగించాడు. చివరి వరకు అజేయంగా నిలిచి, జట్టుకి విజయాన్ని అందించాడు. ఇలా కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడు, తన పేరిట ఓ వరల్డ్ రికార్డ్‌ని నమోదు చేసుకున్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో.. తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ వెస్టిండీస్‌ ఆటగాడు విన్స్‌టన్ బెంజమిన్ పేరిట ఉండేది. 1988లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 40 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచి, తన జట్టుని గెలిపించుకున్నాడు. ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత్ ఆ రికార్డ్‌ని అశ్విన్ బద్దలుకొట్టాడు. కేవలం బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించడమే కాదు, బంతితోనూ అశ్విన్ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇలా బ్యాట్ & బాల్‌తో అశ్విన్ రప్ఫాడించడంతో.. అతనికి మ్యాన్ ఆఫ్ ద అవార్డ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here