కపిల్ దేవ్ రికార్డ్ బద్దలుకొట్టిన జడేజా.. ఆ ఘనత సాధించిన ఏకైక ఇండియన్

0
583

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నాడు. తొలుత బౌలింగ్‌లో ఐదు వికెట్ల హాల్ అందుకొని అదరహో అనిపించిన జడేజా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రప్ఫాడించేస్తున్నాడు. బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లో నింపాదిగా బ్యాటింగ్ చేస్తూ.. అర్థశతకం మార్క్‌ని దాటేశాడు. ఈ నేపథ్యంలోనే జడేజా అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు హాఫ్ సెంచరీ చేయడం.. జడేజాకు ఇది ఐదోసారి. ఇంతకుముందు కపిల్ దేవ్ నాలుగు సార్లు ఈ ఫీట్ అందుకోగా.. జడేజా ఐదోసారి ఆ ఫీట్ సాధించి, కపిల్ రికార్డ్‌ని చెరిపేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జడేజా కనబరుస్తున్న ప్రదర్శనతో అభిమానులు అతనికి ఫిదా అయిపోతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు, భారత బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో చెలరేగిపోగా.. అశ్విన్ మూడు వికెట్లు, షమీ-సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 66, అక్షర్‌ పటేల్‌ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here