నథింగ్ ఫోన్ ఫీచర్లు మామూలుగా లేవుగా..

0
123

నథింగ్ అంటూనే ఫీచర్లలో అదగొడుతోంది నథింగ్ ఫోన్ 1. వన్ ప్లస్ మాజీ కో ఫౌండర్ కార్ల్ పీ సారథ్యంలో ఈ కొత్త ఫోన్ రాబోతోంది. జూన్ 12 నుంచి ఫ్లిఫ్ కార్ల్, రిలయన్స్ డిజిటల్స్ లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. రూ. 2000 రిఫండబుల్ ఎమౌంట్ తో ఈ ముందుగా ఫ్లిఫ్ కార్ట్ లో బుక్ చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయంలో మరే ఫోన్ కు తీసిపోని విధంగా నథింగ్ మొబైన్ ను రూపొందించారు. 120 హెర్జ్ అడాప్టిక్ రిఫ్రెస్ రేట్ డిస్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ రాబోతోంది. 50 మెగా పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా కలిగి ఉండనుంది.

ఈ ఫోన్ గురించి వస్తున్న లీకుల ప్రకారం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 6.55 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ ప్లే కలిగి ఉండనుంది. డిస్ ప్లే వెనకాల గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. 1 f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్ బ్యాక్ కెమెరా కలిగి ఉండి సెకన్ కు 60 ఫ్రేముల 4కె రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ ను అందిస్తుంది.  8జీబీ రామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 31,300గా ఉంటుందని.. 8జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,100లుగా, 12జీబీ+256 మోడల్ ధర రూ. 36,000గా ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here