Smartphones Small Holes: ఆ చిన్న రంధ్రం వెనుక అసలు రహస్యం ఇది!

0
118

The Importance Of Small Holes In Smartphones: దాదాపు స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరూ.. అందులో ఒక చిన్న రంధ్రం ఉండటాన్ని కచ్ఛితంగా గమనించే ఉంటారు. అది ఒక్కొక్క మోడల్‌లో ఒక్కో చోట ఉంటుంది. ఫోన్ పైభాగంలో, కింద చార్జింగ్ పోర్ట్ పక్కన, సెల్ఫీ కెమెరా పక్కన, వెనుకవైపు ఫ్లాష్‌లైట్ పక్కన.. ఇలా ఆయా కంపెనీల్ని బట్టి ఆ రంధ్రం అమర్చబడి ఉంటుంది. అయితే.. ఇది ఎందుకు ఉంటుందన్న విషయంపై చాలామందికి అవగాహన ఉండదు. చాలామంది ఫోన్ లోపలికి గాలి వెళ్లడం కోసమే దీనిని ఏర్పాటు చేసి ఉంటారని అనుకుంటారు. కానీ.. ఆ రంధ్రం వెనుక అసలు కారణం వేరేది ఉంది.

అదేమిటంటే.. మార్కెట్‌లోకి స్మార్ట్‌ఫోన్లు కొత్తగా వచ్చినప్పుడు, దాదాపు వినియోగదారులందరూ వాయిస్ సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యమధ్యలో ఒక రకమైన శబ్దం వచ్చేదని, దాని వల్ల మాటలు సరిగ్గా వినిపించేవి కావని ఫిర్యాదులు చేశారు. దాన్ని నాయిస్ డిస్ట్రర్బెన్స్‌గా గుర్తించిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు.. ఆ తర్వాత నుంచి తమ ఫోన్లలో చిన్న రంధ్రం ఏర్పాటు, ఆ మోడల్స్‌ని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్నుంచి నాయిస్ డిస్ట్రర్బెన్స్ సమస్య తలెత్తలేదు. ఆ రంధ్రంలో ఓ మినీ మైక్రోఫోన్ ఉంటుంది. అది నాయిస్ క్యాన్సిలేషన్ డివైజ్‌గా పని చేస్తుంది. దాని వల్లే వాయిస్‌లో ఎలాంటి అంతరాయం ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here