భారీ మార్పులు చేస్తోన్న ట్విట్టర్‌.. ఇక, మనసువిప్పి రాసుకోండి..!

0
184

ట్విట్టర్‌లో ఏదో రాయాలని ఉన్నా.. మనసు విప్పి ఎన్నో పంచుకోవాలని ఉన్నా.. అందులో ఉన్న అక్షరాల పరిమితి కొన్నిసార్లు అడ్డంకిగా మారుతోంది.. మరోట్వీట్‌.. వరుస ట్వీట్లకు అవకాశం ఉన్నా.. ఒకే ట్వీట్‌లో అన్ని పంచుకోలేకపోతున్నామనే బాధ కూడా ఉంటుంది.. అయితే, ఇక, నో టెన్షన్‌.. ఎందకంటే సోషల్​మీడియా దిగ్గజం ట్విట్టర్‌ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అప్‌డేట్‌ చేస్తూ వస్తున్న ట్విట్టర్‌.. ఇప్పుడు ట్వీట్ ఎడిట్ ఫీచర్‌ను టెస్టింగ్‌లో పెట్టింది.. అంతే కాదు.. మరో ఫీచర్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటి వరకు కేవ‌లం 280 అక్షరాలతోనే ట్వీట్‌ చేసే అవకాశం ఉండగా.. అక్షరాలు పెరిగితే.. మరో ట్వీట్‌ను జోడించాల్సిన పరిస్థితి ఉండేది.. కానీ, ఇప్పుడు అక్షరాల ప‌రిమితిని 280 నుంచి ఏకంగా 2,500కు పెంచాలనే ప్లాన్‌లో ఉంది.

అక్షరాల పరిమితి పెంపు కోసం నోట్స్ పేరిట‌ కొత్త ఫీచ‌ర్‌ను తీసుకురాబోతోంది ట్విట్టర్‌… ప్రస్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న ఈ ఫీచర్‌.. త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. అంటే, సుదీర్ఘమైన ట్విట్‌ చేయొచ్చు అన్నమాట.. అంతేకాదు.. ఫొటోలు, వీడియోలు, జీఐఎఫ్‌ఎస్‌ వంటివి కూడా జోడించే వెసులుబాటు తీసుకొస్తుంది. ట్వీట్‌ చేసే ముందు ప్రివ్యూకు కూడా అవకాశం ఇస్తున్నారు.. అమెరికా, యూకే, కెన‌డా లాంటి దేశాల్లో ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నారు.. ప్రస్తుతం చిన్న సమూహంతో క్లోజ్డ్ టెస్ట్‌ని నడుపుతున్నాం. వారు ట్విట్టర్‌లో వ్రాయడానికి వచ్చిన వ్యక్తులకు ఎలా ఉత్తమ సేవలు అందించాలో తెలుసుకోవడానికి మాకు సహాయపడతారు.. అని ట్విట్టర్‌ పేర్కొంది.. వాస్తవానికి, మొదట ట్వీట్‌ అక్షరాల పరిమిత 140 మాత్రమే.. 2017లో ఆ పరిమితిని 280 అక్షరాలకు పెంచారు.. త్వరలోనే అది 2500 అక్షరాలకు చేరుకోబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here