తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరం సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్డ అలర్ట్ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈనేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని సూచించారు. ఇక మరోవైపు రాష్ట్రంలో వానలు విజృంభించడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈనేపథ్యంలో.. నిన్న (శుక్రవారం) ఉదయం కూలీలు పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు. చుట్టూ నీరు ఉండటంతో రావడానికి అవకాశం లేకపోయింది. ఒడ్డుకు చేరుకోలేక సాయం కోసం ఎదురు చూసారు. రాత్రి వాన ఎక్కువ కురవడంతో.. కూలీలను తీసుకువచ్చేందుకు కొంత ఇబ్బంది ఎదురైంది. దీంతో వరదల్లో చిక్కుకున్న బాధితులకు డోన్ కెమెరా సాయంతో ఆహారాన్ని పోలీసులు పంపించారు. బాధితులను కాపాడేందుకు ndrf బృందం రంగంలోకి దిగింది. 18 గంటలు రెస్క్యూ ఆపరేషన్ చేసి కూలీలను బయటకు తీసుకువచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ పూర్తిచేసారు. కూలీలను ప్రాణాలతో 18 గంటలు కష్టపడి బయటకు తీసుకువచ్చిన సహాయ బృందాలను బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోట్యా తండా, చాంప్ల తండాకు చెంది 23 మంది కూలీలు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ రైతు కౌలుకు తీసుకున్నాడు. వానాకాలం పంట కోసం నాట్లు వేసేందుకు తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోట్యా తండా, చాంప్ల తండాకు చెందిన కూలీలు 23మంది ఉదయం ఆటోలో ముకుందాపురం గ్రామశివారు లోని పాలేరు ఏటి వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యం వరద ఉద్ధృతి పెరగడంతో కూలీలు అక్కడ చిక్కుకుపోయారు.