మరో మూడు రోజులు వర్షాలు.. ఇవాళ, రేపు కుండపోతే..!

0
123

వర్షాలపై సోషల్‌ మీడియాలో ఆవేదనతో పాటు జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు.. ఇక చాలు వరుణ్ అని కొందరు అంటే.. వరుణ దేవుడికి పెళ్లి చేసి ఉంటే.. వాళ్ల అవిడ భయానికి ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయేవాడని.. వర్షాలు కురవాలంటూ కప్పలకు పెళ్లి చేశారు.. వర్షాలు ఆగడం లేదు.. అవి ఎక్కడున్నాయో వెతికి విడాకులు ఇప్పించాలని.. ఇలా అనేక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. అయితే, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.. నిన్నటి తీవ్ర అల్పపీడనం బలపడి ఈ రోజు దక్షిణ ఒరిస్సా తీరం మరియు పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.

మరోవైపు, నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20°N వెంబడి సగటు సముద్రం మట్టానికి 3.1 కిలో మీటర్ల నుండి 7.6 కి మీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉందని తెలిపింది.. ఈ రోజు రుతుపవన ద్రోణి బికానర్ , కోట, మాలాంజ్ ఖండ్, రాయిపూర్,తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తన ప్రకటనలో పేర్కొంది వాతావరణశాఖ.. వీటి ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.. మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షంతో పాటు, ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని.. ఎల్లుండి భారీ వర్షాలు అక్క డక్కడ పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. ఇప్పటికే వర్షాలు అన్ని పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.. వ్యవసాయ పనులే ఊసేలేకుండా పోయింది.. దినసరి కూలీలు కూడా పనిలేక ఇంటికే పరిమితం అయ్యారు.. వరుసగా దంచికొడుతున్న వానలతో చాలా మంది ఉపాధిపై దెబ్బకొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here