ఈరోజుల్లో ప్రింటింగ్ రంగంలో సృజనాత్మకత బాగా కనిపిస్తోంది. సృజనాత్మకంగా ఆలోచిస్తే నవ కల్పనలకు దారి దొరుకుతుంది. హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో విద్యార్ధుల కోసం 3డీ ప్రింటింగ్ పై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. రాబోయే కాలంలో 3డీ ప్రింటింగ్ లో విప్లవాత్మకమయిన మార్పులు రానున్నాయని, సృజనాత్మకంగా ఆలోచించేవారికి మంచి భవిత వుంటుందన్నారు ప్రొఫెసర్ డాక్టర్ కె.కిరణ్ కుమార్. ఇంజనీరింగ్ లో ఔత్సాహికులు 3 డీ ప్రింటింగ్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టాలన్నారు.
ఇందులో ప్రధాన వక్తగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. కొత్త సంకలిత తయారీ విధానం, 3డీ ప్రింటింగ్ లో సృజనాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే వెసులుబాటును కల్పిస్తామన్నారు. అల్టిమేకర్ క్యూరా సాఫ్ట్ వేర్, 3 డీ ప్రింటింగ్ కాంపొనెంట్లలో 3 డీ ప్రింటింగ్ సిమ్యులేషన్, కోడ్ జనరేషన్లో విద్యార్ధులకు ప్రయోగాత్మక అనుభవాన్ని ఆయన కల్పించారు. గీతం హైదరాబాద్ ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీతారామయ్య, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో విద్యార్ధులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.