బిడ్డకు ఎలాంటి కష్టం కలగకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది ఆతల్లి. తన ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డను కాపాడుకోగలిగితే చాలు అనే తెగింపు ఒక్క మాతృమూర్తికే చెల్లింది.. మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ వుంటుంది. తల్లి ప్రేమకు, మనిషి.. పశువు అనే తారతమ్యం వుండదు. కన్నబిడ్డను కాపాడుకునేందుకు తన ప్రాణాలు పోతున్నా పర్వాలేదు, తన బిడ్డ కడుపు నిండితే చాలు అనుకుంటుంది ఆతల్లి. చిన్నప్పటి నుంచి తనకు కావాలసిన వన్నీ కొనిస్తూ.. తను తినకపోయినా.. తన బిడ్డ కడుపు నిండితే చాలు అనుకుంటుంది. ఎటువంటి ఘటనలు ఎదురైనా సరే ఆఅపాయంలో తను ముందుండి తన బిడ్డప్రాణాలకు అడ్డుగా నిలుస్తుంది. నిజం చెప్పాలంటే తల్లి ప్రేమ ముందు ఆదేవడైనా తలదించాల్సిందే.. అంతటి మహా మతృమూర్తి ఆతల్లి. ఓ..కోతి రోడ్డు దాటుతుంది. ఆతల్లిని పట్టుకుని కోతిపిల్ల వుంది. కానీ.. ఇంతలోనే ఓఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఆకోతికి ఓ లారీ.. ఢీ కొట్టింది. అయినా ఆచిన్న పిల్లకు తన ప్రాణాలకంటే తన కడుపు నిండితే చాలనుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్క నూర్లో చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట ఓ కోతి తన పిల్లతో పాటు రోడ్డు దాటబోతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలైనా, పొట్ట కింది భాగంలో ఉన్న పిల్లకు ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడుకొంది.
ఈ క్రమంలో గాయాలతో తల్లికోతి చలనం లేకుండా పడిపోగా నిస్సహాయంగా దాని చుట్టూ తిరుగుతూ, పాలు తాగే ప్రయత్నం చేస్తున్న పిల్లను చూసిన స్థానికులు కదలిపోయారు. నిస్సహాయ స్థితిలో వున్న ఆతల్లిని పట్టుకుని తన ఆకలి తీర్చుకుంటున్న ఆవిషాధ ఘటన చూసి అక్కడ వున్నఅందరిని కంటతడిపించింది. దారి దాటుతున్నప్పుడు మనుషునే చూడకుండా వారిపైకి వాహనాలు దూసుకుపోతుంటారు అలాంటిది ఆకోతి ఒక లెక్కనా అంటూ ఆగ్రహం వ్యక్తం చూస్తున్నారు. ఎవరైనా సరే వాహనాలు నడిపేటప్పుడు అజాగ్రత్తతో కాకుండా.. జాగ్రత్తతో నడిపివుంటే ఆ కోతికి ఇంత దుస్తితి వచ్చేది కాదని కామెంట్ చేస్తున్నారు. ఇకనైనా రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు కాస్త దయచేసి రోడ్డు దాటుతున్న వారిని గుర్తించాలని అది మనిషైనా, జంతువులైనా ప్రాణం ఒకటే అని అంటున్నారు. ఆఘటనను చూసిన వెంకటేష్ అనే వ్యక్తి చలించిపోయాడు. చొరవ చూపి వాటిని తన పొలం వద్దకు తీసుకెళ్లి గోపా లమిత్ర శివ అనే సేవాసంస్థలో ఈ కోతికి చికిత్స అందిస్తున్నారు. ఈఘటనలో తల్లికోతికి వెన్నెముక విరగిందని, అందుకే ఈ దీనస్థితి ఎదురైందని ఆయన తెలిపారు. గోపాల మిత్ర వారు అందిస్తున్న చికిత్సకు అది మెల్లగా స్పందిస్తోందని.. ఇదంతా తెలియని పిల్ల మాత్రం ఎప్పటి లాగే తల్లిని పట్టుకుని వేలాడుతోందని, మనుసు చలించిపోయే ఈఘటన ఎవరికి రాకూదంటున్నారు వెంకటేష్. మీరు కూడా ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడపండి.. ప్రయాణం ఖరీదు ఒక నిండుప్రాణాలు.