హైదరాబాద్ లో నిత్యం ఎక్కడో చోట వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈ ప్రమాదాల వల్ల కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరుగుతుంటే మరి కొని చోట్ల ప్రాణనష్టం జరుగుతుంది.. ఇంకొన్ని చోట్ల ఆస్థి నష్టం ప్రాణనష్టం రెండూ జరుగుతున్నాయి.. తాజాగా రాష్టంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..
రంగారెడ్డి జిల్లా.. మైలార్ దేవులపల్లి.. టాటానగర్‌లో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. బ్లాంకెట్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు.. దాదాపు 1000 గజాల స్థలంలో ఈ గోడౌన్ ఉంది. లోపల దట్టమైన పొగతోపాటూ, మంటలు కూడా వ్యాపించాయి.. సడెన్ గా జరిగిన ఈ ప్రమాదం వల్ల కార్మికులు ఏం చెయ్యలేక ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించి బయటకి పరుగులు తీశారు..
తదనంతరం అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ౩ ఫైర్ ఇంజెన్స్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసాయి..ఇది పరుపుల గోడౌన్ కావడం వల్ల మంటలు త్వరగా అదుపులోకి రావట్లేదు..కాగా ఇదంతా ఇల్లీగల్ గా జరుగుతోందనీ ఆరోపణలు ఉన్నాయి.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు..
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేసురుకున్నారు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. షార్ట్ సర్కుట్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.. ఈ ప్రమాదం కూడా షార్ట్ సర్కుట్ వల్లనే జరిగి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు.. అయితే ప్రమాదానికి కారణం మాత్రం స్పష్టంగ తెలియడం లేదు..