వారంతా ఒక్కటే.. తెలంగాణ ప్రజలు గమనించాలి

0
119

ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్ర‌త్య‌క్ష.. ప‌రోక్ష మిత్రులే అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి ద‌యాక‌ర్ సంచళనవాఖ్యలు చేశారు. రాజాసింగ్ లాంటి వారిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదని అన్నారు. మతంతో బీజేపీ ఏలాల‌ని అనుకుంటుందని మండిపడ్డారు. హిందుత్వాన్ని బీజేపీకి క‌ట్టబెట్టలేదని విమర్శించారు. తెలంగాణలో మ‌త విద్వేషాలు రెచ్చగోట్టేందుకు బీజేపీ ప్రయ‌త‌న్నిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెంగాణలో కాంగ్రేస్ గెలిచే అవకాశం ఉందదనే ఉద్దేశ్యంతో.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ క‌ల‌సి మ‌త విద్వషాలు రెచ్చగోడుతున్నాయని పేర్కొన్నారు. మునావ‌ర్ షో కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది ప్రభుత్వం, రెచ్చ గొట్టింది బీజేపీ అంటూ విమర్శించారు.

బండి సంజ‌య్ పాద‌యాత్ర కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది ప్రభుత్వం …రెచ్చగోట్టే వాఖ్యలు చేసింది బండి సంజ‌య్ అంటూ మండిపడ్డారు. తెలంగాణ లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మాత్రమే ఉన్నాయ‌ని చెప్పేందుకు ప్రయ‌త్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం టీఆర్ఎస్ ప్రత్యక్ష్య మిత్రులని, బీజేపీ, టీఆర్ఎస్ ప‌రోక్ష మిత్రులని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు మ‌తాల ప్రస్తావ‌న ప‌దే ప‌దే తేవ‌డం దివాల కోరు రాజ‌కీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. వీటిని తెలంగాణ ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. ఈనేపథ్యంలో.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది.. టీ బీజేపీ చీఫ్ బండి అంజయ్ అరెస్ట్, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌తో తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.
Covid 19: దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు.. మళ్లీ 10 వేలను దాటిన కేసుల సంఖ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here