ఈనెల 18న పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

0
161

జూలై 18న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈనేప‌థ్యంలో.. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. అయితే.. సంబంధిత మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు.. ఎజెండాలోని ఇతరత్రా అంశాల గురించి ఆయా పార్టీల నేతలకు వివ‌రించి, వారి సహకారం కోరనున్నారు. ఈకార్య‌క్ర‌మంలో.. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. జూలై 18న (అదే రోజు) సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి భవన్‌లో ఎగువసభా పక్ష నేతలతో భేటీ అవుతారు. సమావేశాల నిర్వహణ, సభ్యుల సహకారంపై చ‌ర్చించ‌నున్నారు. జూలై 16న‌ సాయంత్రం 4 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభాపక్ష నేతలతో సమావేశమై.. సభ సజావుగా జరిగేందుకు వారి మద్దతు కోరనున్నారు. కాగా.. ఈ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12తో ముగుస్తాయి.

అయితే.. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఆయనకు ఇవే చివరి రాజ్యసభ సమావేశాలు కానున్నాయి. కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం ఈనెల 5న ప్రారంభమైన నామినేషన్‌ ప్రక్రియ 19వ తేదీతో ముగుస్తుంది. ఇక అధికార, విపక్షాలు మాత్రం ఇంతవరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈనేప‌థ్యంలో.. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈనెల 16న ఉపరాష్ట్రపతి అభ్యర్థిని వెల్లడిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ ప్రకారంగా అధికార కూటమి అభ్యర్థి 18-19 తేదీల్లో ఏదో ఒకరోజు నామినేషన్‌ దాఖలుచేసే అవకాశముంది. ఇక ఆగస్టు 6న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. 16న భాజపా ఎంపీలకు రాష్ట్రపతి ఎన్నికల సంద‌ర్భంగా.. భాజపా పార్లమెంటరీ పార్టీ ఈనెల 16న తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేసింది. ఈనేప‌థ్యంలో.. ఎన్డీయే కూటమి ఎంపీలు, మంత్రుల సమావేశం మాత్రం 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటరీ గ్రంథాలయ భవనంలో జరగనుంది. ఇక వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈనెల 17న విపక్షాలు భేటీ కానున్నాయి. కావున రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతలందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ జాతీయ నేతలంతా విచ్చేసే అవకాశముంది. కాగా.. ఎంపీలంతా ఆరోజు సాయంత్రం 6.30 గంటలకల్లా పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియానికి చేరుకోవాలని పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వర్తమానం పంపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here