విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘనంగా జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు క్షత్రియ సమితి సభ్యులు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పాత్రను వక్తలు కొనియాడారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశమాత దాస్యశృంఖల ఛేదనలో అలుపెరగని పోరాటం చేసిన
మహాయోధుడు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమర శూరుడు తెలుగుజాతి గర్వించదగ్గ మహా నాయకుడు
‘అల్లూరి సీతారామ రాజు 99వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారు.
ప్రగతి నగర్ అల్లూరి సీతారామ రాజు సర్కిల్ లో గల అల్లూరి విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి శౌర్య ప్రతాపాలను కొనియాడారు. స్వాతంత్ర్య భారత సంగ్రామంలో శివాజీ తరువాత అంతటి పోరాట పటిమ కనపరచిన మహావీరుడు అల్లూరి సీతారామ రాజు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జానకి రామరాజు, డా॥ ఎమ్ ఆర్ ఎస్ రాజు, సాయి రాజు, కృష్ణం రాజు, గోపాల కృష్ణం రాజు, గుణరంజన్ సాయి, రామకృష్ణం రాజు(ఆర్కే), శ్రీనివాస రాజు, భాస్కర రాజు, రామచంద్ర నాయక్, అబ్దుల్ నబీ, వై వీ రావు, రామ రాజు, అల్లూరి మనవడు అల్లూరి శ్రీరామ రాజు, కుందన్ వర్మ తదితరులు పాల్గొన్నారు.