అమర్నాథ్ రెడ్డికి డాక్టరేట్ “అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా పోర్ట్ పోలియో మేనేజ్ మెంట్ సేవలపై పెట్టుబడిదారుల అవగాహన’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి బి.అమర్నాథ్ రెడ్డిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఎ.శ్రీరామ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు..
పెట్టుబడిదారులు ముందస్తు కొనుగోలు అవసరాలు, కొనుగోలు అనంతం సేవలు, ప్రమాద అవగాహన, వార్షిక నిర్వహణ సదుపాయాలను అందించే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సేవలపై పెట్టుబడిదారుల నిర్ణయాలపై వాటి ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించినట్టు తెలిపారు. ఫోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ సేవల్లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయాలు తీసుకునే ముందు, కొనుగోలుకు ముందు, ఆ తరువాత అవసరాలను జాగ్రత్తగా విశ్లేషించాలని పెట్టుబడిదారులకు సూచించారని, అలాగే ప్రమాద విశ్లేషణ మొత్తం సంతృప్త స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని కనుగొన్నానున్నారు. అమర్నాథెడ్డి సమర్పించిన సిద్వంత వ్యాసం పీహెడి పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీఏఎస్ఆర్ చర్మ, గీతం బిజినెస్ స్కూల్ హెదరాబాద్ డెరెక్టర్లు ప్రొఫెసర్ వినయ్ కుమార్ అన్నిరాజు, ప్రొఫెసర్ బి.కరుణాకర్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.