నేడు వరలక్ష్మీవ్రతం.. ఆలయానికి పోటెత్తిన భక్తజనం

0
113

శ్రావణమాసమంటే పూజలూ పెళ్లిళ్లతో కళకళలాడుతుంది. అందునా ఈరోజు రెండో శుక్రవారం. ఇవాళ లక్ష్మీదేవిని పూజించేందుకు బుధవారం నుంచే భక్తులు మార్కెట్‌ లో బారులు తీరారు. అమ్మవారికి పూలు, టెంకాయల, అరిటాకులు మొదలగు వస్తువులను కొనేందుకు రెండు రోజుల ముందునుంచే భక్తులు మొదలు పెట్టారు. ఆలయాలకు వెల్లేందుకు ముందుగానే సర్వం సిద్దం చేసుకున్నారు. నిన్న అవసరమైన సరంజామా అంతా తెచ్చేసి, శనగలు నానబెట్టి, నేడు సంతోషంగా, సంబరంగా వరలక్ష్మీ దేవి వ్రతం చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఆలయాలకు వెళ్లి పూజలు, దీపాలు వెలిగించేందుకు, అమ్మవారికి మనసారా పూజించేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే ఆలయాలకు బయలుదేరారు. దీంతో ఆలయాల వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

read also: <a href=”https://ntvtelugu.com/national-news/west-bengal-chief-minister-mamata-benerjee-will-meet-president-draupadi-murmu-and-prime-minister-narendra-modi-today-209979.html”>Mamata Benerjee: దిల్లీ పర్యటనలో బెంగాల్ సీఎం.. నేడు ప్రధానితో భేటీ</a>

<strong><em>వ్రతం.. వరలక్ష్మీదేవి విశిష్టత తెలుసుకుందాం:</em></strong>

ఇంట్లో దారిద్య్రం ఉండకూడదంటే.. ఏనుగులతో అభిషేకం అందుకుంటున్న శ్రీమహాలక్ష్మిని ఉదయం లేవగానే స్మరించుకోవాలి. లోకంలో చాలామంది లక్ష్మి ఉన్నా లేదని, సరస్వతి లేకున్నా ఉందని చెబుతారు. ఇంతకీ లక్ష్మి అంటే కేవలం డబ్బు అనుకుంటున్నారా..? అయితే.. ‘లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం’ అంటే జగతిని అన్నివేళలా కనిపెట్టుకు ఉండేది లక్ష్మి అని అర్థం. విశ్వమంతా లక్ష్మీమయమే దీన్ని అర్థం. లక్ష్మీని ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మిగా ఇలా అష్టలక్ష్ముల రూపంలో అలరిస్తుంది. అంతే కాదు.. ఇల్లలో భూలక్ష్మిగా.. ఇంట్లో గృహలక్ష్మిగా.. పరలోకంలో స్వర్గలక్ష్మిగా ఉండి అంతటా వెలుగులు నింపుతుందని శ్రీనాథుడు అన్నాడు. కావున లక్ష్మీదేవిని శ్రావణంలో వరలక్ష్మిగా కలశరూపంలో ఆరాధిస్తాం.. జలం, దర్భ, పసుపు, కుంకుమ తదితరాలను మంత్రించి ఆవాహన చేస్తే దేవతలు కరుణిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

లక్ష్మి అనుగ్రహం పొందాలంటే ముందు శ్రీహరిని ఆరాధించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి చంచల, చపలచిత్త. నిలకడగా ఒకచోట ఉండదు. కానీ శ్రీహరిని మాత్రం అంటిపెట్టుకునే ఉంటుంది. అంటే విష్ణ్వారాధనం లక్ష్మీ కటాక్ష రహస్యమన్నమాట.పెద్దలు ‘రూపేచ లక్ష్మీ’ అన్నారంటే నిండుగా నగలు ధరించమని కాదు. నవ్వుముఖం, సౌమ్యత, ప్రేమగా పలకరించటం వంటి గుణాలతో లక్ష్మీకళ వస్తుందని భావం. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఈ కళలు అలవడతాయి. అనుక్షణం లోకాన్ని గమనిస్తూ, దయతో పోషిస్తూ మనకు సర్వసంపదలూ సమకూరుస్తున్న వరలక్ష్మిని శ్రావణమాసంలోనే కాదు నిరంతరం పూజిస్తూ.. ఆదేవిని ఆరాధించి అనుగ్రహం పొందాలి అందరూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here