బేడీలు అంటే భయం లేదు.. దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి..

0
31

Y. S. Sharmila: మీకు దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. నాకు భేడిలు అంటే భయం లేదు. మీకు చేతనైతే అరెస్ట్ చేయండని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. నా ఆత్మాభిమానం దెబ్బ తీస్తున్నారు. నన్ను మరదలు అంటే నేను పట్టించుకోకుండా ఉండాలా..? అని ప్రశ్నించారు. ఇదేనా తెలంగాణలో మహిళల మీద గౌరవం? అని మండిపడ్డారు. తెలంగాణలో మంత్రుల మీద కేసులు వేయకూడదా…? డైరెక్ట్ గా చెప్పండి. మేము మంత్రుల మీద కేసులు నమోదు చేయం అని. నేను వైఎస్సార్ బిడ్డ అయి ఉండి కూడా కేసు పెడితే నమోదు చేయడం లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎంటి..? అని ప్రశ్నించారు. ఇది నిజంగా తాలిబన్ల రాజ్యమే.. తెలంగాణలో ప్రజా స్వామ్యమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకడు మరదలు అంటాడు…ఒకడేమో వ్రతాలు అంటాడు. పోలీస్ శాఖ ను టీఆర్‌ఎస్‌ లో విలీనం చేయండి అని షర్మిల మండిపడ్డారు. RSS లా trs కి ఒక సైన్యం లా పని చేయండి. మీకు దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. నాకు భేడిలు అంటే భయం లేదు. మీకు చేతనైతే అరెస్ట్ చేయండి. నా పేరు వైఎస్ షర్మిల..నేను వైఎస్సార్ బిడ్డను. గుర్తు పెట్టుకో కేసీఅర్.. నేను పులి బిడ్డను. వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు..నన్ను కూడా చంపగలరు. నా గొంతు నొక్కడం, నన్ను ఆపడం మీ తరం కాదు. మీతో పోలీస్ లు ఉంటే..నాతో జనం ఉన్నారన్నారు. తెలంగాణలో ఏ మహిళ నైనా అడగండి మరదలు అంటే చెప్పుతో కొడతారా..లేదా? రైతుల మీద ప్రేమ లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. రైతులను సినిమా టిక్కెట్లు తో పోల్చారు. ఉద్యోగాలు అడిగితే హమాలి పని చేసుకో అంటారని మండిపడ్డారు షర్మిళ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here