పార్టీలో ఆసుప‌త్రి సిబ్బంది.. వైద్యం అంద‌క శిశువు మృతి

0
220

నగరంలోని చాదర్ ఘాట్ లో ఓప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు వ‌దిలిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అయితే హ‌స్ప‌ట్ బిల్డింగ్ పై ఓ వివాహానికి ముందస్తు పార్టీ వేడుక‌ల్లో సిబ్బంది నిమ‌గ్నమ‌య్యారు. డీజేతో పాట‌ల‌కు స్టెప్పులు వేస్తూ వేడుక‌లు చేసుకుంటున్న సంద‌ర్బంలో ప్ర‌స‌వం కోసం వ‌చ్చిన గ‌ర్భ‌వ‌తిని వైద్యులు ప‌ట్టించుకోలేదు. దీంతో మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా మారింది. అయినా వైద్య‌లు ప‌ట్టించుకోకుండా పార్టీలో మునిగిపోయారు. అయితే గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో.. శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈఘటన పాతబస్తీలో జరిగింది.

కాగా.. చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గానా బజానా, బాణాసంచాలో సిబ్బంది హంగామా చేపట్టారు. రానున్న మాసంలో డాక్టర్‌ కూతురు వివాహం ఉండటంతో ముందస్తుగానే ఆసుపత్రి బిల్డింగ్‌పై పార్టీని ఏర్పాటు చేశారు. డీజేలో పాటలుపెట్టుకుని ఓరేంజ్ లో డ్యాన్స్‌లు చేస్తూ సిబ్బంది మునిగిపోయారు. అయితే ఆ సమయంలోనే ఓ గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో వచ్చింది. ఆ గర్భిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపినా వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది స్పందించక పోవడం గమనార్హం. డీజే పార్టీలో లీనమై ఎంజాయ్ చేస్తూనే వుండిపోయారు.

అయితే ఈ క్రమంలో గర్భణి తీవ్ర నరకయాతన అనుభవించింది. కానీ శిశువు గర్భంలోనే మృతి చెందింది. కాగా.. గర్భిని ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు విశ్వనీయ సమాాచారం. కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. స్థానిక సమాచారంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. పోస్టుమార్టం కోసం మృతి చెందిన శిశువు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రోగులను పట్టించుకోకుండా పార్టీలో నిమగ్నమైన సదరు ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here