తెలంగాణలో బీజేపీ సుపరిపాలన.. కిషన్ రెడ్డి

0
139

తెలంగాణకు సంబంధించి బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. 8 పేజీల ప్రకటనలో నీళ్ళు, నిధులు, నియామకాలు అమలు కాలేదన్నారు. తెలంగాణపై మాజీ మంత్రి, బీజేపీ నేత డికె అరుణ ప్రకటన చేశారు. కుటుంబ పాలన సాగుతున్న తెలంగాణలో సుపరిపాలన అందించాలని బీజేపీ భావిస్తోంది. 2023 లో బీజేపీ విజయదుందుభి మోగించాలని బీజేపీ చెబుతోంది. బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ ఏర్పడింది. లక్షలమంది కోసం పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమయింది.

సాయంత్రం 4.30 గంటలకు బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి. ప్రభుత్వ యంత్రాంగం సహకరించలేదు. బ్యానర్లు తీసేశారు. మీ నుండి నియంతృత్వ పాలన నేర్చుకోవాలి. కేసీఆర్, ఎంఐఎం కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. 8 సంవత్సరాల నుండి సెక్రటేరియట్ కు రాలేదు… నెలకు 20 రోజులు ఫార్మ్ హౌస్ లో ఉంటారు. డైనింగ్ టేబుల్ మీద జరిగే మీటింగ్ తెలంగాణ కేబినెట్ మీటింగ్. అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ వేసుకొని నేరుగా సీఎం బెడ్ రూం వరకు వెళతాడు. ప్రధానికి వ్యతిరేకంగా కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సీఎం ను జైల్ కు పంపిస్తామని బండి చేసిన వ్యాఖ్యల పై పీయూష్ గోయల్ మాట్లాడారు. తెలంగాణ అవినీతి పై అందరికీ తెలుసు.విచారణ లో అవినీతి బయటకు వస్తుందన్నారు పీయూష్ గోయల్.తెలంగాణలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు బండి సంజయ్. తెలంగాణలో మేం అనేక ఉద్యమాలు చేశాం. చేస్తూనే వున్నాం. అమరుల త్యాగాలను పక్కన పెట్టారు. ప్రజాసమస్యల పట్ల మేం స్పందిస్తున్నాం. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నాం. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కి టెన్షన్ పట్టుకుంది. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం పనిచేస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా చేస్తాం. మోడీ సహకారంతో ముందుకెళుతున్నాం అన్నారు బండి సంజయ్. కేసీఆర్ సంధించిన 9 ప్రశ్నలకు మోడీ సమాధానం చెబుతారని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here