గుంపులు, గ్రూపులు ఏం చేయలేవ్‌.. మేము సింగిల్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : విజయశాంతి

0
851

మరోసారి బీజేపీ నాయకులు విజయశాంతి టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనన్నారు. మోడీ సభ రోజే… పోటీగా సభ పెడుతున్నారని, ఎంతమంది గుంపులుగా.. గ్రూపులుగా వచ్చినా… మేము సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ లేదు… ఏం లేదు… అంతా ఉత్తిదేనని కొట్టేసిన ఆమె.. ప్రభుత్వం కావాలనే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. కలర్ బొమ్మలు పెట్టి ఫ్లెక్సీ లు పెట్టగానే టీఆర్‌ఎస్‌ ఏదో చేసినట్టు కాదని విజయశాంతి వ్యాఖ్యానించారు. పనికిమాలిన పనులు చేస్తోంది ప్రభుత్వమని, బీఆర్‌ఎస్‌ లేదు.. ఏం లేదు… టీఆర్‌ఎస్‌ పరిస్థితి వీఆర్‌ఎస్‌ అయితదంటూ సెటైర్లు వేశారు. యశ్వంత్‌ సిన్హా కోసం ర్యాలీ పెట్టుకుంటాం అంటే… నేనేం కామెంట్ చేయను. అవి రాష్ట్రపతి ఎన్నికలు… మా సభ రోజే పెట్టుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టమని ఆమె అన్నారు.

డబ్బుల ఆశ చూపి… పోలీసులతో బెదిరించి… మభ్య పెట్టి మా కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేసిఆర్ లాంటి నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని, జాతీయ స్థాయి లో కేసిఆర్ ను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక్కడ దిక్కు లేదు గానీ జాతీయ స్థాయి లో ఏం చేస్తారని, బీజేపీ సమావేశాలతో టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోందని ఆమె చురకలు అంటించారు. అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగనున్న విషయం తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వారిలో విజయశాంతి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here