జేపీ నడ్డాతో క్రికెటర్‌ మిథాలీరాజ్‌ ప్రత్యేక భేటీ.. బీజేపీలో చేరతారా?

0
133

తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.. ఇవాళ హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.. విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న నడ్డాకు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌.. సహా మరికొందరు నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లారు నడ్డా.. అప్పటికే నోవాటెల్‌కు చేరుకున్న భారత క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌.. జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వన్‌ టు వన్‌గా ఈ మీటింగ్‌ జరిగినట్టు తెలుస్తోంది.. నోవాటెల్‌కు వచ్చి వెళ్తున్న బీజేపీ నేతలను ఈ విషయంపై ప్రశ్నించగా.. జేపీ నడ్డా-మిథాల్‌ రాజ్‌ మధ్య ఎలాంటి చర్చ జరిగిందనే విషయం తమకు తెలియదు అన్నారు.. నడ్డాతో పాటు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కూడా.. మిథాలీ రాజ్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు.

భారత మహిళా క్రికెట్‌లో మిథాలీరాజ్‌ కీలక భూమిక పోషించారు.. అన్ని ఫార్మాట్లలో రాణించారు.. అనేక విజయాల వెనుక ఆమె కృషి ఉంది.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి మహిళా జట్లకు అవకాశం కల్పించారు.. అయితే, భారత జట్టు బంగారం పథకం సాధిస్తుందని అందరూ ఆశించినా.. ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు బోల్తా కొట్టింది.. సిల్వర్‌ పతకంతో సరిపెట్టుకుంది.. ఈ సిరీస్‌లోనూ మిథాలీరాజ్‌ భారత జట్టు తరుపన ఆడిన విషయం తెలిసిందే.. మహిళా జట్టుకు ఆమె అందిస్తున్న సపోర్ట్‌కు జేపీ నడ్డా అభినందనలు తెలియజేసినట్టుగా తెలుస్తుంది.. మొత్తంగా పొలిటికల్‌ సర్కిల్‌లో ఇది హాట్‌టాపిక్‌గా మారినా.. మితాలీరాజ్‌.. చేపట్టే రోల్‌ను బట్టి.. ఆ సమావేశంలో ఏం జరిగింది? అనేది తెలసే అవకాశం ఉంటుంది. ఇక, రాత్రికే జేపీ నడ్డాతో.. నటుడు నితిన్‌ సమావేశం కానున్న విషయం తెలిసిందే. మరోవైపు.. మిథాలీ రాజ్‌.. భారతీయ జనతా పార్టీలో చేరతారా? అనే చర్చ కూడా సాగుతోంది.. క్రీడాకారులుగా రాణించి.. రాజకీయాల్లో అడుగుపెట్టినవాళ్లు ఎంతో మంది ఉన్నారు.. అయినా.. మిథాలీ రాజ్‌ వస్తే తప్పేంటి? అనే వారు కూడా లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here