నకిలీ ఐపీఎస్ కేసులో మరో నలుగురికి సీబీఐ నోటీసులు

0
40

నకిలీ ఐపీఎస్ కేసులో మరో నలుగురికి నోటీసులు ఇచ్చింది సీబీఐ. హైదరాబాద్ చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. యూసుఫ్ గూడా చెందిన మేలపాటి చెంచు నాయుడు, హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్ నగర్ కు చెందిన రవికి నోటీసులు ఇచ్చింది. సీబీఐలో ఉన్న కేసుకు సంబంధించి సెటిల్మెంట్ చేస్తానని, సీబీఐ ఢిల్లీలో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, ఢిల్లీలో పగటిపూట లారీలు తిరిగేందుకు అనుమతిప్పిస్తానని రవి నుంచి శ్రీనివాస్ డబ్బులు వసూలు చేశారనే విచారణలో తెలుపడంతో వీరందరికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. అది నమ్మిన వ్యాపార వేత్తలు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. డబ్బులతో పాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు విచారణలో శ్రీనివాస్ తెలిపినట్లు సమాచారం. వైజాగ్ లో వాల్తేర్ ప్రాంతంలో అపార్ట్మెంట్‌ లో శ్రీనివాస్ నివాసముంటున్నట్లు అధికారులు గుర్తించారు. వైజాగ్ లో వ్యాపార వేత్త పేరుతో మోసాలకు పాల్పడ్డారని అధికారుల తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here