MP Avinash Reddy: ఏడోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవాల ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాల హైదరాబాద్ కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది సీబీఐ. ఇప్పటి వరకు ఎంపీ అవినాష్ ఆరుసార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరయ్యారు. అరెస్ట్ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ ఇప్పటికే నెలకొంది. ఈ క్రమంలో మరోసారి సీబీఐని పిలిపించడం చర్చనీయాంశమవుతోంది.
కాగా.. వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకెళ్లిన ప్రతిసారీ సీబీఐ అనేక విషయాలను వెల్లడిస్తోంది. అంతకుముందు విచారించిన సీబీఐ. ఎంపీ అవినాష్‌పై రెండు నేరాలను మోపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఆధారాలను మాయం చేశాడంటూ సీబీఐ తెలిపింది. ఈ క్రమంలోనే నిన్న మళ్లీ నోటీసులను జారీ చేయడం సంచలనంగా మారింది. నిన్న ఉదయం వరకు హైదరాబాద్ లో ఉన్న అవినాష్.. కడపకు వెళ్లారు. ఇక తాజాగా నోటీసులు ఇవ్వడంతో మళ్లీ హైదరాబాద్ కు ఆయన తిరిగి వస్తున్నారు. ఇప్పటికే ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి పలుసార్లు విచారణ చేసింది. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కోసం పిటీషన్ వేయగా సీబీఐ కోర్టు దానిని కొట్టివేసింది. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేసును తొందరగా పూర్తి చేసేందుకు విచారణ ముమ్మరం చేశారు.
అవినాష్ రెడ్డిపై సీబీఐ
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీబీఐ అధికారులు. వివేకా హత్య కేసు వెనుక కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది ఆయన ద్వారా తెలియాల్సి ఉందని అంటున్నారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా అవినాష్ పాత్ర పైన వివరించారు. హత్యను గుండెపోటుగా దాచిపెట్టి, కుట్రలో అవినాష్ భాగమని తేలినప్పటికీ, అతను సమాధానం ఇవ్వకుండా తప్పించుకొని తప్పుదారి పట్టించాడని వివరించింది. కస్టడీ విచారణ అవసరమని కోర్టుకు నివేదించారు. హత్యానంతరం అవినాష్ ఇంట్లో 2019 మార్చి 15న తెల్లవారుజామున 1.58 గంటలకు గూగుల్ టేక్ అవుట్ ద్వారా సునీల్ యాదవ్ దొరికాడని సీబీఐ కోర్టుకు వివరించింది. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని… ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది.