Chikoti Praveen: తుపాకీతో కాల్చేస్తామని బెదిరిస్తున్నారు.. కాపాడండి

0
119

Chikoti Praveen Says He Is Getting Threat Calls: ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్.. తాజాగా తనకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాంబ్ పేల్చాడు. తనకు రెండు నంబర్స్ (+447881695247, 9606230648) నుంచి కాల్స్ వచ్చాయని.. హిట్‌మెన్ అనే విదేశీ యాప్‌లో తన పేరుపై సుపారీ ఇచ్చినట్టు వాళ్లు బెదిరిస్తున్నారని చెప్పాడు. తన ఇంటి దగ్గర కూడా గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని, దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, భద్రత కోసం హైకోర్టులో పిటిషన్ సైతం వేశానని తెలిపాడు.

ఈడీ విచారణలో భాగంగా రాజకీయ నేతల పేర్లను రివీల్ చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, కొందరు తమ రాజకీయ స్వార్థం కోసమే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని చికోటి పేర్కొన్నారు. తన భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని కూడా చూస్తున్నారని ఆరోపణలు చేశాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, క్యాసినో ఒక లీగల్ బిజినెస్ అని, ఎలాంటి హవాలాకు పాల్పడలేదని వెల్లడించాడు. కేవలం క్యాసినో వ్యవహారంలోనే ఈడీ విచారణ జరుపుతోందని, ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నాడు. సినీ ప్రముఖుల ప్రమోషన్‌కు సంబంధించిన చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని, ఎక్కడా అవినీతి జరలేదన్నాడు.

తన క్యాసినోకి వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన మాట వాస్తవమేనని.. కానీ అది వారి వ్యక్తిగతమని, వారి గురించి చెప్పలేనన్నాడు. తనకు అన్ని రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలున్నాయని, కానీ రాజకీయాలతో మాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన ఫాంహౌజ్‌లో ఉన్న జంతువుల్ని సైతం నిబంధనల ప్రకారమే పెంచుతున్నానని, వాటికి అనుమతులున్నాయని చెప్పాడు. పురాతన వస్తువులు కూడా కేరళ మ్యూజియం నుంచి లీగల్‌గా కొన్నవేనన్నాడు. విచారణకు ఈడీ ఎప్పుడు పిలిచినా, వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చికోటి ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here