గురు నానక్ విద్యా సంస్థలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

0
1143

గురు నానక్ విద్యా సంస్థలు (గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్, గురు నానక్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ మరియు గురు నానక్ యూనివర్సిటీ) సంయుక్తంగా ప్రతి ఏటా నిర్వహించే క్రిస్మస్ వేడుకలను విద్యార్థులు అధ్యాపకుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థలలోని విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఈ సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, భగవంతుడు ఒక్కడే అని అన్ని మతాలవారు సోదర భావంతో నివసిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధికి తద్వారా దేశాభ్యున్నతికి తోడ్పడాలని ఈ వేడుకలలో పాల్గొన్న గురు నానక్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ మరియు గురు నానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ మాట్లాడుతూ అన్నారు.

గురు నానక్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మరియు గురు నానక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్ ఎస్ సైని మాట్లాడుతూ గురు నానక్ విద్యా సంస్థలు అన్ని ప్రాంతాలు, మతాల వారి మనోభావాలను గౌరవిస్తూ లౌకిక తత్వ భావనకు తోడ్పడుతోందని అన్నారు. భారత దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గురు నానక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి శ్రీనివాసులు, జి ఎన్ ఐ టి సి డైరెక్టర్ డాక్టర్ కె వెంకట రావు, జి ఎన్ ఐ టి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీనాధ రెడ్డి, జి ఎన్ ఐ టి సి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి. పార్ధసారధి, స్కూల్ అఫ్ ఫార్మసీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ షేక్ హరూన్ రషీద్ తదితరులు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ఈ వేడుకలలో పాల్గొన్నారు.


ప్రత్యేక క్రిస్మస్ కారల్స్, స్కిట్స్ తో తెలుగు రాష్ట్రాలు మరియు ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు అలరించారు. క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సెమి క్రిస్మస్ వేడుకలకు కన్వీనర్లుగా జి ఎన్ ఐ టి నుండి డాక్టర్ విజయ్ కుమార్, జి ఎన్ ఐ టి సి నుండి ప్రొఫెసర్ దేవశేఖర్, గురు నానక్ యూనివర్సిటీ నుండి డాక్టర్ మోజెస్ వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here