తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోమటిరెడ్డి. అయితే ఇవాళ శుక్రవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలో చోటుచేసుకున్న సమస్యలపై చర్చించారు. అయితే కోమటిరెడ్డి స్వల్ప అనారోగ్యం కారణంగా చుండూరులో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన రద్దు చేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినట్లు వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
బిజెపిలో చేరుతారంటూ గతంలో కూడా ప్రచారం జరిగిందని, అయితే తాను కాంగ్రెస్ లోనే ఉంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ను ఓడించే సత్తా బిజెపికి మాత్రమే ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ ను ఓడించే పార్టీలో ఉంటానని ఆయన చెప్పారు. దీంతో ఆయన బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అమిత్ షాతో కలిసి మాట్లాడిన విషయం నిజమేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ మార్పుపై గతంతో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. కెసిఆర్ ను ఓడించడమై లక్ష్యంగా పనిచేస్తానని ఆయన అన్నారు. అయితే ఈనేపథ్యంలో.. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన కూడా అసంత్రుప్తితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు తీవ్రమైన నష్టమే జరుగుతుందని విశ్వసనీయ సమాచారం.