నిజమే మంత్రి కేటీఆర్ అందంగా ఉంటాడు… అంతే అందంగా అబద్దాలు చెబుతాడంటూ సెటైర్లు వేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. మంత్రి కేటీఆర్‌ను బయటికి వస్తే టాలీవుడ్‌లోకి తీసుకెళ్తారు అన్నారు.. అందంగా ఉన్నావు, హీరోను చేస్తారు అన్నారు అని గుర్తుచేసిన ఆయన.. నిజమే కేటీఆర్ అందంగా ఉంటాడు.. అబద్దాలు కూడా అందంగా చెప్పేస్తాడంటూ ఎద్దేవా చేశారు.. సినిమా యాక్టర్లలాగా ఉంటే సరిపోతుందా..? అని ప్రశ్నించారు నారాయణ. మరోవైపు.. అగ్నిపథ్ స్కీమ్ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నారాయణ.. యువకులను గాలికి వదలం కటింగ్ షాపులు, ఇస్త్రీ షాపులు, చెప్పుల షాపులు పెట్టుకోవచ్చని కేంద్రమంత్రి అంటున్నారు.. ఆర్‌ఎస్ఎస్, బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయోచ్చని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
మరోవైపు.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ జరిగిన విధ్వంసం, పోలీసుల ఫైరింగ్‌పై స్పందించిన నారాయణ.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసు ఆఫీసర్లు దద్దమ్మలు అని వ్యాఖ్యానించిన ఆయన.. బులెట్ మిస్‌ఫైర్ ఆయ్యిందని అంటున్నారు.. పోలీసులు వెళ్లి గాడిదలు మేపుకొండి అంటూ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్ పోరాటంలో రాకేష్ పై జరిగిన కాల్పుల విషయంలో పోలీసుల మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఇక, సీఎం కేసీఆర్ కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి అంటాడు తప్ప ఏ దానికి సిద్ధంగా ఉండడు అని సెటైర్లు వేశారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా మరో అభ్యర్థిని పెట్టేందుకు కేసీఆర్, వైఎస్ జగన్ ముందుకు రావాలని సూచించారు.. మరోవైపు, తెలంగాణలో భూముల రేట్లు కోట్లు పలుకుతున్నాయని సీఎం కేసీఆర్ అంటే.. జహీరాబాద్ వచ్చిన కేటీఆర్ నిమ్జ్ రైతులకు ఐదు లక్షలు పరిహారం ఇస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. న్యాయం కోసం నిమ్జ్ రైతులు ఎదురు చూస్తుంటే వారిపై లాఠీఛార్జి చేయిస్తారా? అని నారాయణ మండిపడ్డారు.