హిట్లర్ కి పట్టిన గతే మోడీ కి పడుతుంది

0
177

హిట్లర్ కి పట్టిన గతే మోడీ కి పడుతుందని జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ మండిప‌డ్డారు. గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదంటూ.. జపాన్ పోతే 14 డ్రెస్ లు మార్చి.. మళ్లీ నేను సన్యాసిని అంటారు మోడీ అంటూ విమ‌ర్శించారు. బీజేపీ తెలంగాణ మీద దృష్టి పెట్టిందని మండిప‌డ్డారు. హిట్లర్ ఎలాగైతే మంచిమాటలు చెప్పి. గెలిచి దేశాన్ని ఆక్రమించినట్టు ఉంది బీజేపీ వ్య‌వ‌హారం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ తక్కువ సీట్లు గెలిచిన చోట కూడా అధికారం కొల్లగొడుతున్నారని మండిప‌డ్డారు. మహారాష్ట్ర అయిపోయింది.. ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టారని నిప్పులు చెరిగారు. టీఆర్ ఎస్ నీ చిల్చడమో. లేదంటే లేకుండా చేయడమో చేస్తుందని నారాయ‌ణ అన్నారు. మోడీ పార్టీ సమావేశానికి వస్తున్నారు కాబట్టి నిరసన ఏం చెప్పమ‌ని అన్నారు. కానీ మోడీని నిలదీయాలని నిర్ణయించామ‌ని అన్నారు.

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీయాలని మోడీ డిసైడ్ అయ్యారని మండిప‌డ్డారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో అదే పార్టీ ఉండాలని లేదని అన్నారు. ఆర్ ఎస్ ఎస్‌ అనుమతించిందా..? అంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్రాలను ధ్వంసం చేయడమే మీ పని అయితే.. కార్యవర్గం లో తీర్మానం చేయండని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శివసేనలో అంతర్గత పంచాయతీలో బీజేపీకి ఎం సంబందం అంటూ ప్ర‌శ్నించారు. మొగుడు.. పెళ్ళాల పంచాయితీలు కూడా బీజేపీ చేసేటట్లు ఉందని ఎద్దేవ చేశారు. శివసేన మీద రాజకీయ దాడి ఓ వైపు.. మరో వైపు ఈడీ నోటీసులు ఇస్తుందని అన్నారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్ట అంటించుకున్నట్టు ఉంది బీజేపీ వ్య‌వ‌హారం అని మండిప‌డ్డారు.

బీజేపీ..ఈడీ నీ ఇలా రాజకీయాలకు వాడుకోవాలని అమొదిస్తుందా..? అని ప్ర‌శ్నించారు. మేనిఫెస్టో లో పబ్లిక్ సెక్టార్ నీ అమ్మెస్తే అని చెప్పారా..? అంటూ నిల‌దీసారు. బలహీన ప్రధాని కూడా ఆస్తులు అమ్మలేదు, బలమైన ప్రధాని అని చెప్పే మోడీ 24 పబ్లిక్ ఆస్తులు అమ్మేశారని అన్నారు. 28 మంది బ్యాంకుల లూట్ చేస్తే.. దేశం విడిచి పోతే పట్టించుకోలేదని విమ‌ర్శించారు. దేశం విడిచిన వాళ్లంతా గుజరాత్ వాళ్ళే.. కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను లూటి చేసిన వాళ్ళను జైల్లో పెట్టారని ఎద్దేవ చేశారు. అప్పుల ఎగవేత దారులు కూడా మోడీ హయాంలో పెరిగిందని విమ‌ర్శించారు. పెద్ద నోట్లు రద్దు అని.. బడా కంపెనీల బ్లాక్ మనీ వైట్ అయ్యిందని మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేతల అవినీతి చిలక కొట్టుడని మండిప‌డ్డారు.

బీజేపీ అవినీతి హోల్ సేల్ అంటూ విమ‌ర్శించారు. నెలకు 75 లక్షలు మేకప్ టీం వాడిని ప్రధాని లేడని మండిప‌డ్డారు. సోకులు పడు కానీ.. పబ్లిక్ సెక్టార్ నీ ఎందుకు దొచేస్తున్నవంటూ ప్ర‌శ్నించారు. మోడీ..అమిత్ షా నీ మించిన దోషి ఎవరు లేరని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. 18 మందిని తుద ముట్టిస్తే తప్పితే.. మోడీ..అమిత్ షా లు నిర్దోషులు కాలేదని మండిప‌డ్డారు. సుప్రీం కోర్టు జడ్జిలు కూడా ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేస్తున్నారని మండిప‌డ్డారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో అధికార దుర్వినియోగం జరుగుతుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై బీజేపీ జెండాలు అంటూ స‌టైర్ వేసారు. నోవ టెల్ లో కోటీశ్వరుల పెళ్ళిళ్ళు జరుగుతాయని, బీజేపీ పార్టీ నా.. కార్పొరేట్ కంపెనీ నా..? అంటూ ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here