తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెబుతూ దసరా సెలవులు ప్రకటించింది.. ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో పరీక్షలు జరుగుతుండగా.. దసరా పండు దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. దసరా సెలవులను ముందుగానే నిర్ణయించింది.. అక్టోబర్ 5వ తేదీన విజయ దశమి ఉండగా.. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అంటే.. దసరా పండుగ సెలవులు ఈ నెల (సెప్టెంబర్) 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఉంటాయని ప్రకటించింది.. అయితే, ఈ నెల 25వ తేదీన, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో ఈ ఏడాది మొత్తంగా దసరా సెలవులు 15 రోజుల పాటు రాబోతున్నాయి.. అంటే.. ఈ నెల 24వ తేదీన స్కూళ్లు మూత బడితే.. తిరిగి అక్టోబరు 10న తెరుచుకోనున్నాయి..