Telangana: మంచిర్యాలలో.. డబుల్ బెడ్ రూమ్ గొడవ

0
151

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన పేద ప్రజలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి వాటిని ఆక్రమించుకున్నారు. దాదాపు వంద కుటుంబాలకు చెందిన ప్రజలు మూకుమ్మడిగా ఇళ్లలోకి ప్రవేశించారు. కరెంటు, తదితర కనీస సౌక ర్యాలు లేకున్నా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. అక్రమంగా ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశిం చారనే నెపంతో పలువురిపై కేసులు నమోదు చేసినా ప్రజలు అక్కడి నుంచి కది లేదని మొండికేస్తున్నారు.

మూడు నియోజకవర్గాల పరిధిలో జిల్లాలోని మంచిర్యాల చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,416 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో మంచిర్యాల నియోజక వర్గానికి 685 ఇళ్లు మంజూరు కాగా 650 ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిలో 430 ఇళ్లు నిర్మాణాలు ప్రారంభంకాగా మరో 220 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించవలసి ఉంది. మంచిర్యాలకు సంబంధించి రాజీవ్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు 358 నిర్మాణాలు పూర్తయ్యాయి.

42 ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో ఉండగా 250 ఇళ్లకు సంబంధించి 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. అలాగే చెన్నూరు నియోజకవర్గానికి 1,146 మంజూరయ్యా యి. వీటిలో మందమర్రిలో 560, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి 286, చెన్నూరుకు 300 ఇళ్లు కేటాయించారు. వీటిలో 194 ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మిగతా వాటిలో మందమర్రిలో 160 ఇళ్లు 50 శాతం మేర పూర్తికాగా, 400 ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. బెల్లంపల్లి నియోజక వర్గానికి 585 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 170 ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా మరో 415 ఇళ్లకు సంబంధించి స్థలం వివా దం కొనసాగుతోంది.

Pooja Hegde: నిర్మాణ సంస్థ షాక్ .. నీ బిల్లు నువ్వే కట్టుకో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here