మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం.. నోట్లో ఆసిడ్ పోసి..

0
154

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై బలంవంతంగా నోట్లో యాసిడ్ పోసిన ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ఓకిరాతకు మైనర్​పై అత్యాచారం చేసి, తన గురించి ఎవరికి చెప్పకుండా ఉండటానికి ఆమె నోట్లో యాసిడ్​ పోశాడు. దీంతో బాధితు రాలిని విషమంగా మారింది. అక్కడే వున్నవారు గమనించి ఆమెను హుటాహటిన ఆసుత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని చికిత్స జరుగుతోందని తెలిపారు. ఇక మరోవైపు ఈ ఘటనపై స్పందించిన దిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా అత్యాచారానికి గురైన బాదితురాలి వాంగ్మూలం త‌క్ష‌న‌మే తీసుకుని మెజిస్ట్రేట్ కు అందించాల‌ని సూచించారు.

ఇక వివార‌ల్లోకి వెలితే.. ఘ‌ట‌న‌కు గురైన బాధితురాలి కుటుంబం రోజువారీ కూలీ చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే షూ పరిశ్రమలో పనిచేసేందుకు బాధితురాలు వెళ్లింది. అయితే.. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి నమ్మించిన మేనేజర్​ జై ప్రకాశ్​, బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈనేప‌థ్యంలో.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అత‌ని వ‌ద్ద‌నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించగా.. త‌న గురించి ఎవ‌రికి చెప్ప‌కుండా జాగ్ర‌త్త‌ప‌డిన నిందితుడు బాధితురాలి నోట్లో యాసిడ్ పోశాడు. అయితే… అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాధితురాలు,​ అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గ‌మ‌నించిన కుటుంబ‌స‌భ్యులు బాధితురాలిని ఎయిమ్స్​కు తరలించారు. దీంతో.. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితున్ని అదుపులో తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here