బీజేపీ ఎంపీకి నిరసన సెగ.. దాడి, మూడు కార్లు ధ్వంసం

0
126

వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో.. ముంపునకు గురైన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి సందర్శించేందుకు నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ బయలుదేరారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎంపీ అరవింద్‌ ను అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో అరవింద్‌ కారుపై దాడి చేసారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా.. గతేడాది మల్లన్న గుట్ట భూమి విషయమై గ్రామ కుల సంఘాలు కలిసి ఎంపీనీ వేడుకున్న విషయం తెలిసిందే.. అయితే విషయాలను ధర్మపురి అరవింద్‌ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అరవింద్ కారు దిగగానే ఏమొహం పెట్టుకుని వచ్చావంటూ ప్రశ్నించారు. ఓట్లు వేయించుకునేందుకు చేతులు జోడించి మొక్కే భూటకపు రాజకీయాలకు ఈ గ్రామం స్వస్తి పలుకుతుందని మండిపడ్డారు. ముంపునకు గురైన మా గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుని మాకు న్యాయం చేయాలని, వివాదంలో వున్న మల్లన్నగట్ట భూమి మాకు చెందే వరకు మా పోరాటం ఆగదని గ్రామస్తులు ఆరోపించారు. వానలతో నష్టపోయిన మాకు ఓదార్చకుండా ఓట్లు కోసం తప్పా రాజకీయ నాయకులు ఎన్నికోవడం ఇంకెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్రిక్త పరిస్థితి నడుమ ఎంపీ అరవింద్ ను పోలీసులు అక్కడనుంచి ఆయనకు పంపించివేసారు. గ్రామస్తులను పరిస్థితి సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here