నేటి నుంచి స్కూల్స్‌ పునఃప్రారంభం..

0
113

తెలంగాణలో విద్యాసంస్థలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. వానలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. పాఠశాలలతో పాటుగా కాలేజీలు, యూనివర్సిటీలు తెరుచుకోనున్నాయి. అయితే గత వారం 11వ తేదీన భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే దీంతో అలర్ట్‌ అయిన విద్యాశాఖ.. విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ఈనేపథ్యంలో తిరిగి నేటి (సోమవారం) నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. వారం రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకోనున్నాయి. గత వారం రోజులు తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు అన్నియూ మూత పడ్డాయి. అయితే ఈ నెల 11, 12, 13 తేదీల్లో భారీ వర్షాలను దృష్టి ఉంచుకుని టీఆర్‌ఎస్‌ సర్కార్‌.. సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో.. వర్షాలు తగ్గకపోవడంతో.. 14, 15, 16 తేదీల్లోనూ సెలవులు ప్రకటించింది. కాగా.. 17 వ తేదీన ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది కాబట్టి నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మరోసారి సెలవుల గడువు పెంచుతున్నామని ప్రభుత్వం ఎక్కడా చెప్పక పోవడంతో, నేటి నుంచి యథావిధంగా తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విధ్యార్థులందరూ పాఠశాలలకు పయనమవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here