కుటుంబాలలో చిచ్చుపెడుతున్న వివాహేతర సంబంధాలు..

0
573

ఇటీవలి కాలంలో వివాహేతర బంధాలు ఎక్కువయిపోతున్నాయి. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసింది భార్య. అతను ఉండే ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసింది ఫర్నీచర్‌ను ధ్వంసం చేసింది.వరంగల్ జిల్లా పైడిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధాలతో తమ పచ్చని సంసార జీవితంలో చిచ్చు రేపుకుంటున్నారు చాలా మంది . తాజాగా వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ అధికారి ఒకరు తన కింద పని చేసే ప్రభుత్వ అధికారిణితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని పసిగట్టిన కట్టుకున్న భార్య.. తన భర్తకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన భర్త పరాయి స్త్రీతో పడకపై ఉండగా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది.

భార్య చేతిలో తన్నులు తిన్న ఈ భర్త పేరు జీవన్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేసేవాడు.కోటి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 4 సంవత్సరాల క్రితమే సస్పెండ్ అయ్యాడు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో పని చేసే మహిళ తో జీవన్ మరో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా భర్త తీరు మారకపోడవంతో ఆగ్రహంతో బంధువులతో కలిసివెళ్లి చితకబాదింది ఆయన భార్య

వరంగల్ నగరంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన జీవన్ కుమార్ అనే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఇదే కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా పని చేసే ప్రతిభ అనే మహిళతో అక్రమం సంబంధం ఉండేది. అయినప్పటికీ గత నాలుగేళ్ల క్రితం ఈయన కుమార్ పల్లికి చెందిన చందన అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ప్రతిభతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

భార్యను వేధించ సాగాడు. ఈ వేధింపులు తారా స్థాయికి చేరుకున్నాయి. అదేసమయంలో భర్త ఇంటికి రావడం మానేశాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అక్రమ సంభందం గుర్తించిన జీవన్ భార్య దీంతో అతనికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని తన కుటుంబ సభ్యులు బంధువులను ఇంటికి పిలిపించింది. తన భర్త పరాయి స్త్రీతో ఉన్న ఇంటికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి చితకబాది, తన భర్తను, ప్రతిభను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి పోలీసు విచారణ జరుపుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here