శాంతించిన గోదావరి.. భద్రాద్రిలో తగ్గిన వరద

0
136

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు తగ్గుతూ వస్తుంది నిన్న రాత్రి తగ్గిన గోదావరి మళ్లీ పెరిగి తగ్గడం ప్రారంభించింది. మూడు రోజుల క్రితం 71.3 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఆ తర్వాత క్రమేపి తగ్గుతూవస్తోంది. 1986లో అత్యధికంగా 75.6 అడుగులకు చేరుకోగా 1990లో 70 అడుగులకు చేరుకుంది. ఆ తర్వాత ఈ స్థాయికి మళ్లీ ఇప్పుడే మొదటిసారి గోదావరి పెరిగింది . నిన్న రాత్రి గోదావరి దోబూచులాట ఆడింది. నిన్న రాత్రి వరకు తగ్గి మళ్లీ గోదావరి పర్యాటక ప్రాంతంలో వరదలు వర్షాలు బాగా రావడంతో పాటు మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి కూడా 12 లక్షల పైగా విడుదల చేశారు. దీంతో మళ్లీ కొంతమేరకు గోదావరికి వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గత రాత్రి ఏడు పాయింట్లు అంటే ఒక అడుగు లోపే పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తగ్గడం ప్రారంభించింది ప్రస్తుతం భద్రాచలం గోదావరి నీటిమట్టం 55.8 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది మరింత తగ్గితే మరో రెండు అడుగులు తగ్గితే మూడవ ప్రమాద హెచ్చరికను తొలగిస్తారు. 48 అడుగులకి తగ్గితే రెండో ప్రమాద హెచ్చరిక, 43 అడుగుల వరకు తగ్గితే మొదటి ప్రపంచ హెచ్చరిక ఉపసంహరిస్తారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవటంతో గోదావరి ప్రాంతంలో వరదలు కూడా తగ్గుతున్నాయి.

భద్రాచలం వద్ద గోదావరి వల్ల అన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ భద్రాచలం రెవిన్యూ డివిజన్ పరిధిలోని చర్ల దుమ్ముగూడెం బూర్గంపాడు అశ్వాపురం మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటివరకు జాతీయ రహదారిపై ఇంకా నీళ్లు వల్ల రవాణాకి ఆటంకం గానే ఉంది . వరదలు వస్తాయని తెలిసినప్పటికీ ముందస్తుగా సహాయ చర్యలను తీసుకోవడాం లో ప్లాన్ చేయడం అంచనాలు వేయడంలో అధికారులు విఫలమయ్యారు. వరదల వల్ల సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరికి నిత్యవసర వస్తువుల సరఫరాకి ఆర్మీ హెలికాప్టర్ రావాల్సి వచ్చింది. గతంలో ముందుగానే లాంచీలను సిద్ధం చేసుకునే వారు ప్రస్తుతం అటువంటి మందస్తు చర్యలకు గత అధికారులు స్వస్తి పలికారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇక్కడ గురయ్యారు. కాగా భద్రాచలం వద్ద రామాలయం పక్కనే స్లూయిజ్ లీకేజీ వల్ల రామాలయం చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో నీళ్లు వచ్చి చేరాయి దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు అధికారల వైఖరి పట్ల దుమ్మెత్తి పోస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here