Woman Dead Body: గాంధీనగర్‌ లో మహిళ మిసింగ్.. స్థానికుల అనుమానమే నిజమైంది

0
42

ఉభయ రాష్ట్రాల రాజధాని నగరం హైదరాబాద్ కుండపోతగా కురుస్తున్న వర్షాలకు అతలాహుతులం అవుతుంది.. ఇప్పటికే రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుతుండగా గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు..

ఈ నేపథ్యంలో వరద నీటితో మూసి నది పొంగి పొరలుతూ ఉగ్రరూపాన్ని దాల్చింది.. ఈ తరుణంలో మూసారాంబాగ్ వంతెన సమీపంలో నీటి ప్రవాహం తారస్థాయికి చేరింది.. దీనితో రాత్రి 9 గంటల నుండి వంతెన మీద రాకపోకలు నిచిపోయాయి.. మూసీ వరద నీటితో వంతెనపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్‌ఎంసీ కార్మికులు తొలగిస్తున్నారు..

చెత్తను తొలిగిస్తున్న క్రమంలో కార్మికులు ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు.. వెంటనే పోలీసులకి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం మూడు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో అదృశ్యమైన లక్ష్మిదిగా గుర్తించారు.. అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులకి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న లక్ష్మి కూతురు పచ్చబొట్టు మరియు ముక్కు పుడక ఆధారంగా తల్లిని గుర్తించి ఇది తన తల్లి మృతదేహమే అని తెలిపారు..

కాగా హుసేన్ సాగర్ కి వెళ్లే కాలువ పక్కన లక్ష్మి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. ఈ మధ్య కురిసిన వర్షానికి ఇంటి గోడ కూలిపోయింది.. అప్పటి నుండి లక్ష్మి కనపడట్లేదు.. దగ్గర్లోని సీసీ టీవీని పరిశీలించగా ఆమె ఇంట్లోకి వెళ్లి బయటకు రానట్లు తెలిసింది.. దీనితో స్థానికులు లక్ష్మి కాలువలో పడి కొట్టుకుపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.. వాళ్ళ అనుమానమే నిజమైంది.. తల్లిని కోల్పోవడంతో లక్ష్మి కూతురు గుండెలవిసేలా రోదిస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here