తుమ్మల రమాదేవి గారికి గీతం యూనివర్శిటీ డాక్టరేట్

0
197

ప్రముఖ న్యూస్ ఛానెల్ ఎన్టీవీ మీడియా రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఎన్టీవీకి చెందిన రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్టీవీ, వనితటీవీ, భక్తి టీవీ) డైరెక్టర్ తుమ్మల (చండ్ర) రమాదేవికి గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రొఫెసర్ ఎస్.ఎస్.ప్రసాదరావు పర్యవేక్షణలో “వర్క్ లైఫ్ బ్యాలన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ 24/7 వర్కింగ్ ఎన్విరాన్ మెంట్ – ఏ స్టడీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు సెలెక్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ “అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు.

తుమ్మల రమాదేవి తన పరిశోధనలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని 24/7 విధానంలో పనిచేస్తోన్న వివిధ రంగాలకు చెందిన ఎంపిక చేసిన సంస్థలలో మహిళల వర్క్ లైఫ్ బ్యాలన్స్ ను విశ్లేషించారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఉద్యోగ సంతృప్తి, రోల్ స్ట్రెస్ మరియు ఫ్యామిలీ సపోర్టుకు సంబంధించి డెమోగ్రాఫిక్స్ పాత్రను పరిశీలించారు.

2009లో భారతదేశంలో మహిళల కోసం ప్రత్యేకించిన తొలి టెలివిజన్ గా వనిత టీవీ ప్రారంభించారు తుమ్మల రమాదేవి. ఈ ఛానెల్ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా రమాదేవి వహించారు. వనిత ఛానెల్ కార్యక్రమాలు పలు టీవీ నంది, యునిసెఫ్, లాడ్లీ మీడియా పురస్కారాలు వంటి అవార్డులు సాధించాయి. లాభనష్టాలతో పనిలేకుండా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది వనిత టీవీ. ఈ బాధ్యతల్ని తుమ్మల రమాదేవి సమర్థంగా నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. తుమ్మల రమాదేవి డబుల్ ఎం.ఎ., ఎల్.ఎల్.బి., ఎం.బి.ఎ చదివారు.తుమ్మల రమాదేవికి డాక్టరేట్ రావడం పట్ల రచన టెలివిజన్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here